నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీం తీర్పు.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ఏమన్నారంటే..?

-

నీట్ పేపర్ లీక్ కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. మే 5న జరిగిన నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ జరిగిందని, అవకతవకలు జరిగాయని నీట్ యూజీ పునఃపరీక్ష నిర్వహించాలని కోరుతూ వచ్చిన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి నీట్ రీ-ఎగ్జామ్ అవసరం లేదని తీర్పు చెప్పింది.

ఈ తీర్పు పై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. పరీక్షను రద్దు చేసి, మళ్లీ పరీక్షను నిర్వహించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో రెండు రోజుల్లో ఎన్టీఏ తుది ఫలితాలను ప్రకటిస్తుందని ఆయన ప్రకటించారు. గరిష్టంగా రెండు రోజుల్లో కొత్త మెరిట్ జాబితా వస్తుందని వెల్లడించారు.నీట్‌పై విపక్షాలు అరాచకాలు సృష్టించాలని, అల్లర్లు సృష్టించాలని చూస్తున్నాయనీ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును సత్యమేవ జయతే అని ,సత్యం గెలిచిందని అన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news