భాజపా అధ్యక్షుడు అమిత్ షా పశ్చిమ బెంగాళ్ లో చేపట్టనున్న రథయాత్రకు సుప్రీం కోర్టు నో చెప్పింది. మరోసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలని భాజపాకు కోర్టు సూచించింది. రథయాత్రపై ప్రభుత్వం ఆధారపూరితమైన అభ్యంతరాలనే తెలిపినట్లు కోర్టు అభిప్రాయపడింది. అయితే రాష్ట్రంలో భాజపా ర్యాలీలు, సభలు నిర్వహించుకొనేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని 42 పార్లమెంటరీ స్థానాలను కవర్ చేస్తూ రథయాత్ర చేపట్టాలని భాజపా నిర్ణయించింది. అయితే మత పరమైన విద్వేశాలు పెరిగే ఆస్కారం ఉండటం వల్ల యాత్రకు అనుమతించేది లేదని ప్రభుత్వం తెలిపింది.
దీనిపై భాజపా కలకత్తా హైకోర్టుకు వెళ్లగా.. యాత్రను నిరాకరిస్తూన్నట్లు తెలిపింది. దీంతో యాత్రకు అనుమతించడాన్ని తోసిపుచ్చిన కలకత్తా హైకోర్ట్ ఉత్తర్వులను భాజపా సుప్రీంలో సవాల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం రథయాత్రకు నో చెప్పింది.