జవాన్లకు నా సెల్యూట్…కేటీఆర్

-

ఆర్మీడే సందర్భంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన . సైనికుల సేవలను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. 130 కోట్ల మంది భారతీయులకు రక్షణ కవచంలా ఉంటూ… తన ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న జవాన్ల గురించి ఎంత పొగిడినా తక్కువే అంటూ వారి సేవలను గుర్తు చేసుకున్నారు. ‘జవాన్ల ధైర్యానికి, వారి సాహసాలకు నా సెల్యూట్. సైనికులు, వారి కుటుంబసభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా’  అంటూ కేటీఆర్ ట్వీట్‌ చేశారు.


ఏటా జనవరి 15న దేశ వ్యాప్తంగా సైనిక దినోత్సవం జరుపుకుంటోంది. 1949 జనవరి 15న నాటి భారత కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ సర్ ఫ్రాన్సిస్ బుచర్ నుంచి లెఫ్టినెంట్ జనరల్ కేఎం కరియప్ప అధికారాలను పొందారు. దీంతో విదేశీ సైనిక పాలన నుంచి దేశానికి విముక్తి పొందడంతో ఏటా జనవరి 15న ఆర్మీ డే నిర్వహిస్తున్నారు. 71వ ఆర్మీ డే సందర్భంగా.. యావత్ దేశం  వారికి సెల్యూట్ చేస్తోంది. ఈ సందర్భంగా  ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో వార్షిక పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ సైతం వీర సైనికులకు వందనాలు సమర్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version