మోదీకి క్లీన్ చీట్ పై ఈనెల 19న విచారణ…

-

నాడు గుజరాత్‌ మత ఘర్షణల కేసులో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీకి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ జకియా జాఫ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 19న సుప్రీం విచారణ జరపనుంది.  2002లో భారీ ఎత్తున మత ఘర్షణలు చోటు చేసుకోవడంతో  ఆ ఘర్షణల్లోని గుల్బర్గ్‌ సొసైటీ హత్యాకాండలో జాఫ్రి భర్త, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఇషాన్‌ జాఫ్రి కూడా సజీవదహనమైన సంగతి తెలిసిందే.

అయితే ఇంతటి దారుణానికి కారణమైన నాటి ముఖ్యమంత్రి మోదీకి క్లీన్ చీట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ… 2017 అక్టోబర్‌ 5న జకియా జాఫ్రి గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె అభ్యర్థనను హైకోర్టు తిర్కరించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ… జాఫ్రి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వచ్చే సోమవారం విచారణ చేపట్టనున్నట్లు జస్టిస్‌ ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాససం మంగళవారం వెల్లడించింది

Read more RELATED
Recommended to you

Exit mobile version