సూరారం బాలిక కిడ్నాప్ హత్య కేసును చేధించారు పోలీసులు. సూరారంలో బాలికను కిడ్నాప్ చేసి హత్య చేశాడు యువకుడు. బాలిక తల్లినీ అనుభవించాలన్న కోరికతో బాలికను హత్య చేశాడట. బాలిక తల్లికి ఎవరు లేకపోతే తన దగ్గరకు వస్తుందని ఆశించిన తిరుపతి…. బాలిక తల్లి కోసం ముగ్గురిని చంపేందుకు ప్లాన్ చేశాడు.
ముందుగా ఏడేళ్ల బాలికను హత్య చేసి తర్వాత మరో పాపను హత్య చేయాలని ప్లాన్ చేసిన తిరుపతి…. బాలిక తల్లి సహజీవనం చేస్తున్న ప్రభాకర్ని కూడా చంపేందుకు ప్లాన్ చేశాడు. ఈ తరుణంలోనే… బాలికను కిడ్నాప్ చేసి కత్తితో గొంతు కోసి చంపాడు తిరుపతి. బాలిక మృతి దేహం ను గుర్తుపట్టకుండా ఉండేందుకే గోన సంచిలో కుక్కి పారిపోయాడు తిరుపతి. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసి హత్య చేశాడు తిరుపతి. ఈ కేసును తాజగా పోలీసులు.. ఛేదించారు.