ఈసారి దీపావళి పండుగను ఎప్పుడు చేసుకోవాలి..? లక్ష్మీ పూజ ముహూర్తం ఎప్పుడు..?

-

దసరా పండుగ అయిపోయింది. ఇక దీపావళి పండగ వచ్చేస్తోంది. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో దీపావళి కూడా ఒకటి. ఏటా ఆశ్రయుజ మాసం ఆఖరి రోజు కార్తీక మాసం ప్రారంభానికి ముందు రోజు వచ్చే అమావాస్య నాడు దీపావళి అమావాస్యని జరుపుకుంటాము. అయితే అన్ని పండుగల్లా కాకుండా దీపావళిని ఐదు రోజులు జరుపుకుంటూ ఉంటారు. ధన త్రయోదశి నుంచి యమ విదియ వరకు ఐదు రోజులు ఈ పండుగను జరుపుతారు. ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలి పాడ్యమి ఇలా ఐదు రోజులు జరుపుకుంటారు. దసరా తొమ్మిది రోజులు పాటు దుర్గాదేవిని ఆరాధిస్తారు దీపావళి వేళ మహాలక్ష్మిని పూజిస్తారు.

ధన త్రయోదశి నుండి లక్ష్మీదేవికి కుబేరుడికి పూజలు చేస్తారు దీపావళి అమావాస్య నాడు సాయంత్రం అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంటారు. దీపావళి పండుగను అమావాస్య రోజు జరుపుతారు. ఏదైనా తిధి రెండు రోజులపాటు వచ్చిందంటే ఇబ్బందే. సాధారణంగా హిందువుల పండుగలు అన్ని సూర్యోదయానికి తిథి ఉన్న రోజును ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈసారి ఎప్పుడూ దీపావళి జరుపుకోవాలి అనేది చూస్తే అక్టోబర్ 29 మంగళవారం ఉదయం 10:30 నుంచి ప్రారంభమై అక్టోబర్ 30 బుధవారం మధ్యాహ్నం 12:35 వరకు ధన త్రయోదశి ఉంది. అందుకని అక్టోబర్ 30న ధన త్రయోదశి జరుపుకోవాలని.. నరక చతుర్దశి అక్టోబర్ 31 గురువారం నాడు జరుపుకోవాలి.

దీపావళి విషయానికి వచ్చేస్తే, దీపావళి పండుగను సూర్యాస్తమయం తిధి అక్టోబర్ 31 ఉంది కాబట్టి 31నే జరుపుకోవాలని.. ఈ రోజే లక్ష్మి పూజ దీపావళి జరుపుతారు. ఈసారి నరక చతుర్దశి దీపావళి రెండు ఒకే రోజు వచ్చాయి. దీపావళి రోజు సాయంత్రం చేసే పూజకు ముందు ఏర్పాట్లు చేసుకోండి. దీప దీప నైవేద్యాలు ఏం చేయాలి అంటే, పూలు, పండ్లు, అలంకరణ సామాగ్రి, ప్రమిదలు వంటివి ఏర్పాటు చేసుకోండి లక్ష్మీదేవిని ప్రతిష్టించే లక్ష్మీదేవిని ఆరాధించండి ఇల్లంతా దీపాలు పెడితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version