‘కంగువా’ నుంచి క్రేజీ అప్‌డేట్.. ఏకంగా 38 భాషల్లో విడుద‌ల కానున్న‌ తొలి పాన్ వరల్డ్ సినిమా!

-

సూర్య ‘కంగువా’ అనే పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రీ లుక్‌ పోస్టర్‌లు, గ్లింప్స్ సినిమాపై వీర లెవల్లో అంచనాలు క్రియేట్‌ చేశాయి. ఏడాది కిందట మొదలైన ఈ ప్రాజెక్ట్ శ‌ర‌వేగంగా షూటింగ్‌ను కంప్లీట్‌ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా మూవీ నుంచి ఒక సాలిడ్ అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

ఈ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా 38 భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు స‌మాచారం. ఇక ఇన్ని భాషల్లో రిలీజవుతున్న తొలి ఇండియన్ సినిమా ఇదే. అంతేకాకుండా అన్ని భాషల్లో 3డీ వెర్షన్ కూడా రిలీజ్ కాబోతుందట. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చుతున్నాడు. యూవీ క్రియేషన్స్‌, స్టూడీయో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version