రామ్ చ‌ర‌ణ్ 15వ సినిమాలో విల‌న్ గా సూర్య‌

-

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెర‌కెక్కుతున్న విషయం తెలిసిందే. కాగ ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ న‌డుస్తుంది. ఆర్‌సీ 15 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ను శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. కాగ ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో, ఫిల్మ్ ఇండిస్ట్రీలో తెగ చెక్క‌ర్లు కొడుతుంది. ఈ సినిమాలో విల‌న్ పాత్ర‌లో ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు ఎస్. జే సూర్య ను చిత్ర బృందం ఫిక్స్ చేశార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

కాగ ఎస్ జే సూర్య గ‌త కొద్ది రోజుల నుంచి విల‌న్ పాత్ర‌ల‌లోనూ క‌నిపిస్తున్నాడు. తెలుగు లో మ‌హేశ్ బాబు స్పైడ‌ర్ సినిమాలో తొలి సారి ప్ర‌తి నాయకుడి పాత్ర‌లో సూర్య కనిపించారు. తెలుగులో మొద‌టి సినిమా అయినా.. త‌న హావాభావాల‌తో తెలుగు ప్రేక్షకులను ఆక‌ట్టుకున్నాడు. అలాగే విజ‌య్ అదిరింది సినిమాలో కూడా ఎస్ జే సూర్య తెలుగు ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర అయ్యాడు. అలాగే ఇటీవ‌ల శింబు మానాడు సినిమాలో కూడా ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ పాత్ర‌లో న‌టించాడు.

Read more RELATED
Recommended to you

Latest news