‘సస్టెయిన్ కార్ట్’ భారీ మోసం.. బాధితుల్లో తెలుగు టాప్ హీరోయిన్లు!

-

హైదరాబాద్‌లో మరో భారీ మోసం వెలుగుచూసింది.సెలబ్రిటీలు,వ్యాపారవేత్తలే లక్ష్యంగా తృతీయ జ్యువెల్లరీ అధినేత కాంతి దత్..‘సస్టెయిన్ కార్ట్’ పేరిట భారీ మోసానికి తెరలేపాడు.దీనికి బాలీవుడ్ హీరోయిన్ ‘పరిణీతి చోప్రా’ బ్రాండ్ అంబాసిడర్ అని నమ్మించి డబ్బులున్న సెలబ్రిటీలతో పెట్టుబడులు పెట్టించాడు. ఇటీవల శ్రీజ రెడ్డి అనే మహిళ తాను మోసపోయినట్లు గ్రహించి..జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.


హీరోయిన్లు, వ్యాపారవేత్తల నుంచి సుమారు రూ.100 కోట్లు దోచినట్లు సమాచారం. కాంతి దత్ బాధితుల్లో హీరోయిన్ సమంత, కీర్తి సురేష్, డిజైనర్ శిల్పారెడ్డి వంటి స్టార్లు కూడా ఉన్నట్లు తెలుస్తుండగా.. సంతకాలను ఫోర్జరీ చేసి మోసాలకు పాల్పడినట్లు అతడిపై అభియోగాలున్నాయి. సీసీఎస్‌లో కూడా అతనిపై కేసులు నమోదైనట్లు సమాచారం. ఇదిలాఉండగా, సస్టెయిన్ కార్ట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, సంవత్సరం క్రితమే అందులో నుంచి బయటికి వచ్చానని శిల్పారెడ్డి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version