లంగర్ హౌస్ లో హిట్ అండ్ రన్ చోటు చేసుకుంది. ఈ సంఘటన లో ఇద్దరు నవ దంపతులు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేస్ నమోదు అయింది. మద్యం మత్తులో టూ వీలర్ తో పాటు ఆటోను ఢీకొట్టింటి ఓ స్విఫ్ట్ కారు. ఈ ప్రమాదంలో ఇద్దరు నవ దంపతుల మృతి చెందారు.
స్విఫ్ట్ కారు TS34K5031 మొదట ఆటోను ఢీ కొట్టింది. ఆ తర్వాత ముందుగా ప్రయానిస్తున్న జూపిటర్ స్కూటీ పై ఇద్దరు దంపతులు ఢీకొట్టింది. దీంతో స్పాట్ లో దంపతులు మృతి చెందారు. ఆటో లో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు అయ్యాయి. మృతురాలు మోనా గర్భవతి అని తెలుస్తోంది. మృతులు మోనా, దినేష్ ఇద్దరిదీ ప్రేమ వివాహం అని సమాచారం.
ఇద్దరు దంపతులు ప్రవేట్ ఉద్యోగస్తులు అని పోలీసులు చెబుతున్నారు. అటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు క్షతగాత్రులు. అటు పోలీసుల అదుపులో కారు డ్రైవర్ పవన్ ఉన్నారు. కారు సీజ్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.