Suvvi Suvvi Lyric Video: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా నుంచి క్రేజీ అప్డేట్ తాజాగా రిలీజ్ అయింది. ఈ సినిమా సెకండ్ సింగిల్ తాజాగా రిలీజ్ చేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రియాంక, పవన్ కళ్యాణ్ రొమాంటిక్ గా నటించిన సువ్వి సువ్వి పాటను రిలీజ్ చేశారు.

ఇందులో.. పవన్ కళ్యాణ్ అలాగే ప్రియాంక మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది. లిరిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే హరిహరవీరమల్లు సినిమాతో వచ్చి ప్రేక్షకులను మెప్పించాడు. మరో చిత్రం ఓజీ సెప్టెంబర్ 25, 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే OG మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటోంది.