వావ్‌.. ఎస్వీబీసీకి విశ్వవ్యాప్త గుర్తింపు…

-

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ కు విశ్వ వ్యాప్తంగా గుర్తింపు ల‌భించింద‌ని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో ఎస్వీబీసీ ద్వారా మ‌రింత జ‌న‌రంజ‌క కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. ఎస్వీబీసీ 15వ వార్షికోత్స‌వం శుక్ర‌వారం తిరుప‌తి లోని ఛాన‌ల్ కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి టీటీడీ చైర్మ‌న్ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు.

ఎస్వీబీసీ ద్వారా ప్రసారం అయిన సుందరకాండ, భగవద్గీత లాంటి పారాయణాలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయన్నారు ఈవో ధర్మారెడ్డి. దీంతో ఛానల్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకులు పెరిగారని, ఎస్వీబీసీ యూట్యూబ్‌, ఆన్‌లైన్‌ రేడియో కూడా భక్తుల ఆదరణ పొందుతున్నాయని చెప్పారు. హిందీ, తమిళం, కన్నడ భాషలకు ఆయా కేంద్రాల్లో స్టూడియోలు నిర్మించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా భక్తులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు రూపొందిస్తామని తెలిపారు. ఎస్వీబీసీ ఛానన్ లో పనిచేసే ఉద్యోగుల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు వైవీ సుబ్బారెడ్డి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version