ALERT: టెన్త్ క్లాస్ విద్యార్థులకు ముఖ్య గమనిక…

-

తెలంగాణకు సంబంధించిన టెన్త్ క్లాస్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలు ఈ ఉదయం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలలో మొత్తం 80 .59 శాతం పాస్ అయినారు. గత నెల జూన్ లో మొత్తం 259 పరీక్ష కేంద్రాలలో పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు రాయడినాయికి 72 వేల మంది విద్యార్థులు హాజరవడం జరిగింది. ఇప్పుడు ఈ ఫలితాలలో తాము ఊహించని విధంగా వచ్చి ఉంటే వారికి విద్యాశాఖ ఒక అవకాశం ఇచ్చింది. రీకౌంటింగ్ మరియు రీ వెరిఫికేషన్ కు ఎప్పుడు అప్లై చేసుకోవాలి అన్న విషయం గురించి అధికారులు తెలియచేశారు. ఒక్కో సబ్జెట్ కోసం విద్యార్థులు రూ. 500 జులై 18 లోపు SBI బ్యాంక్ చలానా ద్వారా చెల్లించి ఆ రిసీప్ట్ ను SSC ఆఫీస్ కు పంపాలట.

 

అదే విధంగా రీ వెరిఫికేషన్ కోసం ఒక సబ్జెక్టు కు రూ. 1000 చొప్పున జులై 10 నుండి 18వ తేదీ లోపు చలానా రూపంలో చెల్లించి, దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. విద్యార్థులు వెంటనే అలర్ట్ అయ్యి… పైన తెలిపిన విధంగా అప్లై చేసుకోగలరని కోరుచున్నాము.

Read more RELATED
Recommended to you

Exit mobile version