యూపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల బీజేపీ యోగి ఆతిథ్య నాథ్ మంత్రి మండలికి మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా చేశారు. అయితే తాజాగా ఈయనకు స్థానిక కోర్టు బుధవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. స్వామి ప్రసాద్ మౌర్యపై ఏడేళ్ల నాటి కేసుకు సంబంధించి అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 2014లో హిందూ దేవతలను దూషించాడనే కేసు నమోదైంది. బుధవారం కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో స్థానిక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు న్యాయమూర్తి యోగేష్ కుమార్ యాదవ్ ఆయనపై వారెంట్ జారీ చేశారు. 2016లో అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ స్టే విధించిన ఇదే కేసులో అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. స్వామి ప్రసాద్ మౌర్యను ఈనెల 12న జడ్జి మందు హాజరుకావాలని జనవరి 6నే ఆదేశించినా.. హాజరుకాలేదు. తదుపరి విచారణను జనవరి 24కు వాయిదా వేసింది.
ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ముందు.. కేబినెట్ మంత్రి, ఓబీసీలో మంచి పట్టున్న స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీని వీడినప్పటి నుంచి యూపీలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఇకపై బీజేపీలోకి తిరిగి వచ్చేది లేదని మౌర్య స్పష్టం చేశారు.