బిగ్‌బాస్ సీజన్ 4 రోజులు గడుస్తున్నా కొద్దీ రసవత్తరంగా సాగుతోంది. శనివారం ఎలిమినేషన్ రౌండ్ కావడంతో అంతా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆసక్తిగా ఎదురుచూశారు. దీంతో ఈ వారం ఎలిమినేషన్ రౌండ్‌పై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. అభిజీత్, హారిక, సోహైల్, లాస్య, మొహబూబ్, స్వీతీ దీక్షిత్, కుమార్ సాయి ఎలిమినేషన్ రౌండ్లోకి వచ్చేశారు.
వీళ్లలో శనివారం అనూహ్యంగా స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయ్యింది. సేఫ్ గేమ్ కాకుండా గన్‌తో ఎలిమినేషన్ రౌండ్‌ని నాగార్జున మొదలుపెట్టారు. ఒక రౌండ్ పూర్తయ్యే సరికి ఎవరిపై గన్ పేలకపోవడంతో అంతా సేఫ్ అయినట్టే అని భావించారు. ఒకరిని ఒకరు అభినందించుకున్నారు అయితే నాగార్జున ఇక్కడే ఇంటి సభ్యులకు ట్విస్ట్ ఇచ్చారు. అప్పుడే గేమ్ అయిపోలేదని మరో రౌండ్ గన్ పేలే వరకు గన్ చేతులు మారుతూనే వుండాలని చెప్పడంతో సభ్యుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఓ విధంగా చెప్పాలంటే ఈ శనివారం నామినేషన్ తీవ్ర ఉత్కంఠ మధ్య ముగిసింది. వైల్డ్ ఎంట్రీగా వచ్చిన స్వాతీదీక్షిత్ ఎలిమినేట్ అయినా మిగతా సభ్యులు సేఫ్ కాలేదని వారు ఎలిమినేషన్ నౌండ్లోనే వున్నారని నాగార్జున స్పష్టం చేయడంతో మిగతా సభ్యుల్లోనూ ఒకింత భయం స్టార్టయింది. ఆదివారం స్వాతీ దీక్షిత్ హౌస్ నుంచి బయటికి రాబోతోంది. తను ఏం చెబుతుందో తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ చూడాల్సిందే.