పాదాలు, అరచేతుల్లో చెమట ఎక్కువగా వస్తుందా? ఐతే ఇది తెలుసుకోండి.

-

శరీరానికి చెమట పుట్టడం సాధారణమే. చెమట పుట్టడం అనేది శరీరాన్ని చల్లబరిచే ప్రక్రియ. శరీరంలో వేడిగా మారుతుంటే దాన్ని చల్లార్చేందుకు ఆటోమేటిక్ గా చెమట పుడుతుంది. ఐతే ఇది ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. వారి వారి శరీరాల్ని బట్టి చెమట ఎక్కువ, తక్కువ ఉంటుంది. వేడి శరీరం అయితే ఎక్కువ చెమట పోస్తుంది. తక్కువ వేడి అయితే చెమట తక్కువ పోస్తుంది. ఐతే శరీరంలోని అన్ని ప్రాంతాల్లో చెమట పట్టడం ఒకే విధంగా ఉండదు. పెదవుల మీద అసలు చెమట పట్టదు. దానిక్కారణం అక్కడ స్వేద రంధ్రాలు లేకపోవడమే.

అదంతా అటుంచితే పాదాలు, అరచేతులు, చంకల్లోనూ చెమట పడుతుంది. కానీ కొందరికి ఈ ప్రదేశాల్లో చెమట పట్టడం మరీ ఎక్కువగా ఉంటుంది. అలా అధిక చెమట పడుతున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండడం అవసరం. ఎందుకంటే పాదాలు, అరచేతులు, చంకల్లో ఎక్కువగా చెమట పట్టడం అనేది డయాబెటిస్ కి కారణం కావచ్చు. అందుకే అలాంటి ప్రదేశాల్లో మరీ ఎక్కువగా చెమట పోస్తున్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా డాక్టరుని సంప్రదించడం మంచిది.

ఈ ప్రదేశాల్లో చెమట పోయకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి.

చల్లని నీళ్ళలో గుడ్డని ముంచి పాదాలని తుడవాలి. అలాగే బ్లాక్ టీ చెమటని తగ్గిస్తుంది. అందులో ఉండే టానిక్ ఆమ్లం చెమటని అడ్డుకుంటుంది.

ఆ టానిక్ ఆసిడ్ లో మీ పాదాలని 20నిమిషాల వరకు నానబెట్టినా ఫలితం ఉంటుంది.

చందనం పేస్ట్, కలబంద రసాన్ని చంకల్లో, పాదాలకి మర్దన చేయాలి.

వేడి చేసే వస్తువులు, మసాలా ఎక్కువగా ఉండే పదార్థాలని ఆహారంగా తీసుకోకూడదు. వీటివల్ల పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది.

తెల్ల ఉల్లిపాయలు, కాలేయం, బీఫ్ మొదలగు పదార్థాలను తినకూడదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version