తియ్యటి గవ్వలను దీపావళికి సింపుల్ గా చేసేయచ్చు..!

-

దీపావళికి మంచిగా స్వీట్స్ ని తయారు చేస్తుంటారు అంతా. మీరు కూడా ఏదైనా స్వీట్ ని తయారు చెయ్యాలని అనుకుంటున్నారా..? ఈజీగా మీరు దీపావళి కి గవ్వలను చేసేయచ్చు. అది కూడా ఎంతో సింపుల్ గానే. ఇవి చక్కగా తియ్యగా క్రిస్పీ గా ఉంటాయి.

మైదాపిండి, బొంబాయి రవ్వని కలిపి వీటిని చెయ్యాలి. అలానే చక్కెర పాకం పాటి చెయ్యాలి. ఎవరైనా సరే సులభంగా వుండే స్వీట్ ని చెయ్యాలని అనుకుంటే ఇవి బెస్ట్. మరి ఎలా చెయ్యాలో చూసేద్దాం.

గవ్వలను తయారు చేయడానికి కావాల్సిన పదార్దాలు:

బొంబాయి రవ్వ – 1 కేజీ
మైదా పిండి – 1 కేజీ
పంచదార – 1 కేజీ
ఉప్పు – తగినంత
పాలు – రెండు గ్లాసులు
నూనె – వేయించడానికి సరిపడా

గవ్వలను తయారు చేసే పద్దతి:

దీని కోసం ముందగా మైదాపిండి, బొంబాయి రవ్వని జల్లించి పక్కన పెట్టండి.
దీనిలో ఇప్పుడు సాల్ట్ ని వెయ్యండి.
ఇప్పుడు గట్టిగా దీన్ని నీళ్లు పోసి కలుపుకుని పక్కన ఉంచండి.
తరవాత గవ్వలను చేతితో చేసుకోండి.
పాన్ లో ఆయిల్ వేసి వేడెక్కనివ్వండి.
వాటిలో గవ్వలను ఫ్రై చేసేయండి.
పంచదారను ముదురు పాకం పట్టి దానిలో గవ్వలను వేసి బాగా కలపాలి.
ఇలా గవ్వలను ఈజీగా మనం చేసేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version