వాస్తు: తల కింద వీటిని పెట్టుకుంటే సమస్యలేనట..!

-

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు నిద్ర పోయేటప్పుడు ఎలాంటివి చేయకూడదు అనేది చెప్పారు. వాటి కోసం ఇప్పుడు చూద్దాం.

పుస్తకాలు:

పుస్తకాలని నిద్ర పోయినప్పుడు తల కింద పెట్టుకోవడం వల్ల సమస్యలు వస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా పుస్తకాలని తలకింద పెట్టుకోకూడదు. జ్ఞానాన్ని మీరు ఇన్సల్ట్ చేసినట్లు అవుతుంది. అలానే మీ కెరీర్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది.

అద్దం:

అద్దం తలకింద పెట్టుకుని నిద్ర పోకూడదు. అలానే మీ ఎదురుగా పెట్టుకోకూడదు. అద్దాన్ని ఇలా పెట్టుకోవడం వల్ల టెన్షన్స్ పెరిగిపోతాయి సమస్యలు కలుగుతాయి.

బంగారు నగలు:

తలకింద బంగారు నగలను కూడా పెట్టకూడదు. దీని వలన కోపం పెరిగి పోతుంది. రిలేషన్ షిప్ లో ఇబ్బందులు వస్తాయి.

వాలెట్:

మీ వాలెట్ ని కూడా నిద్ర పోయినప్పుడు తల కింద పెట్టుకోకూడదు. ఇలా పెట్టుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి.

చెప్పులు:

తల కింద చెప్పులుని పెట్టుకుని నిద్ర పోకూడదు. నెగిటివ్ ఎనర్జీ కలిగి పాజిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version