ఫుడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త క్రెడిట్ కార్డ్‌ను లాంచ్ చేసిన స్విగ్గీ

-

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి తమ ఇంటికి, ఒంటికి కావల్సిన వస్తువులను ఆర్డర్ పెట్టుకుంటున్నారు. అందులో కడుపు నింపే యాప్స్ కూడా అరడజను పైగానే ఉన్నాయి. వాటిలో పేరుపొందింది స్విగ్గీ. తాజాగా ఈ ఫుడ్ డెలివరీ యాప్ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ అయిన ఎచ్ డి ఎఫ్ సి తో చేతులు కలిపి ఒక క్రెడిట్ కార్డును రూపొందించారు. గతంలో జొమాటో కూడా ఆర్బీఎల్ బ్యాంకు సహకారంతో ఇలాంటి క్రెడిట్ కార్డును తీసుకొని వచ్చింది.

ఈ క్రెడిట్ కార్డు ద్వారా స్విగ్గీలో ఫుడ్, గ్రాసరీ ఆర్డర్ చేస్తే పది శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే అమెజాన్, అడిడాస్, ఓలా, ఫార్మ్ ఈజీ, నెట్ మెడ్స్, ఫ్లిప్ కార్ట్, నైక్, ఉబెర్, బుక్ మై షోతో సహా వెయ్యికి పైగా భాగస్వామ్య ప్లాట్ ఫామ్‌లలో 5 శాతం క్యాష్ బ్యాక్ ఉంటుందని బెంగళూరు ప్రధాన కార్యాలయంగా కలిగిన స్విగ్గీ వెల్లడించింది. ఇతర కొనుగోళ్లపై 1 శాతం క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ మొత్తం స్విగ్గీ మనీలో జమ అవుతుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version