ఎగ్జిబిషన్​లో 50 అడుగుల నుంచి కింద పడ్డ స్వింగ్.. స్పృహ తప్పిన చిన్నారులు

-

పంజాబ్​లోని మొహాలిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఓ ఎగ్జిబిషన్ ఫెయిర్​లో సందర్శకులను గాలిలో పైనుంచి కిందకు తిప్పే స్వింగ్ విరిగి కుప్పకూలిపోయింది. ఈ సమయంలో స్వింగ్​పై సుమారు 50 మంది కూర్చున్నారు. 50 అడుగుల ఎత్తు నుంచి అది కింద పడటం వల్ల.. పలువురికి గాయాలయ్యాయి. కొందరు చిన్నారులు వెంటనే స్పృహ తప్పి పడిపోయారు. అక్కడే ఉన్న కొంతమంది వేగంగా స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సాంకేతిక సమస్యతో స్వింగ్ పడిపోయినట్లు తెలుస్తోంది.

మొహాలిలోని దసరా గ్రౌండ్​లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ ఫెయిర్ నిర్వహణకు సెప్టెంబర్ 4 వరకు అనుమతి ఉందని అధికారులు తెలిపారు. అయితే ఫెయిర్ ప్రవేశద్వారం వద్ద ‘సెప్టెంబర్ 11 వరకు గడవు పొడగించి’నట్లు రాసి ఉన్న బోర్డు ఉందని చెప్పారు. ‘నిర్వాహకులకు ఈ షో జరిపేందుకు అనుమతులు ఉన్నాయని ప్రాథమికంగా తెలిసింది. అయితే, ఈ ప్రమాదం ఎవరి తప్పు వల్ల జరిగిందో అని తెలుసుకునే పనిలో ఉన్నాం. ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. క్షతగాత్రులందరినీ సివిల్ ఆస్పత్రిలో చేర్పించాం’ అని డీఎస్పీ హర్​సిమ్రన్ సింగ్ బల్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version