నేను ఎంత అన్నా… కేసీఆర్ కు చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శలు చేశారు వైఎస్ షర్మిల. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు 40 రోజులుగా విధులు బహిష్కరించి దీక్షలు చేస్తున్నా, కేసీఆర్ కు చీమ కుట్టినట్టు కూడా లేదని ఫైర్ అయ్యారు. అటు ఆర్టీసీ కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తుండు. ఇది ప్రజాస్వామ్య పాలనా? రాచరిక పాలనా? అని నిలదీశారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేంతవరకు YSR తెలంగాణ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. రైతులతో పాటు భూనిర్వాసితుల తరఫున కూడా ఉద్యమిస్తాం. కేసీఆర్ జిత్తులమారి జిమ్మిక్కులు బంద్ పెట్టి, ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల.
కృష్ణా నదికి ఉపనది అయిన దుందుభి నదిపై వైయస్ఆర్ గారు బ్రిడ్జి నిర్మించి, రెండు మండలాల ప్రజలకు ప్రయోజనం చేకూరిస్తే.. కేసీఆర్ కు కనీసం బస్సులు వేయడం కూడా చేతకావడం లేదు. ఈ బ్రిడ్జికి వైయస్ఆర్ పేరు పెట్టాలన్న స్థానికుల డిమాండ్ ను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు షర్మిల.