ఈ లక్షణాలు కనపడుతున్నాయా..? అది క్యాల్షియం లోపమే..!

-

క్యాల్షియం వలన చాలా మంది అనేక ఇబ్బందులు పడుతుంటారు. క్యాల్షియం లోపం ఉందని ఎలా తెలుసుకోవచ్చు.. క్యాల్షియం లోపాన్ని ఎలా గుర్తించొచ్చు అనే విషయాలని చూసేద్దాం. ఇవి కనుక ఉన్నట్లయితే కచ్చితంగా కాల్షియం లోపం అని తెలుసుకోవాలి. శరీరానికి కాల్షియం చాలా ముఖ్యం. ఎముకలని దృఢంగా మారుస్తుంది క్యాల్షియం.

 

కండరాలు నరాల వ్యవస్థ పనితీరుని కూడా బాగా ఉంచేందుకు కాల్షియం చాలా అవసరం కొంత మందిలో కాల్షియం తక్కువ ఉంటుంది. కాల్షియం లోపం వలన ఎముకలు దంతాలు బలహీనంగా మారిపోతాయి. పైగా సమస్యలు కలుగుతాయి. క్యాల్షియం లోపం వలన ఎముకల నుండి ఇతర పోషకాలను గ్రహించడం వల్ల క్యాల్షియం లోపం ఏర్పడ వచ్చు. కాల్షియం తక్కువ ఉంటే ఈ లక్షణాలు కనబడతాయి. ఈ లక్షణాలు ఉంటే కచ్చితంగా కాల్షియం లోపం అని తెలుసుకోండి.

క్యాల్షియం లోపం తో బాధ పడే వాళ్ళకి ఆకలి బాగా తగ్గుతుంది. తింటే వికారంగా అనిపిస్తుంది. శరీరంలో క్యాల్షియం లోపం ఉంటే మానసిక, శారీరక సమస్యలు ఎక్కువవుతాయి. ఇటువంటి సమయం లో అలసిపోవడం, నీరసంగా ఉండడం వంటివి కనబడతాయి. ఇలా ఉంటే కూడా క్యాల్షియం లోపం ఉందని గ్రహించ వచ్చు. కొంత మంది లో వణుకు సమస్య కూడా ఉంటుంది. అది కూడా క్యాల్షియం లోపమే అని గుర్తు పెట్టుకోవాలి. చిన్న విషయానికి కూడా ఎక్కువ ఆలోచించడం, డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం, ఆందోళన కూడా క్యాల్షియం లోపాలకి కారణాలే.

Read more RELATED
Recommended to you

Exit mobile version