విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. పవన్ ఢీల్లీ లో ప్రధాని మోదీ, అమిత్ షాని కలిసినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కోసం మాట్లాడాలి లేదా పోలవరం నిధుల కోసం, ఇతరత్రా రాష్ట్ర ప్రయోజనాలకోసం మాట్లాడాలి కానీ టిడిపి – బిజెపి ని కలపడానికి మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. జగన్ ఢిల్లీ వెళితే రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడి నిధులు తెచ్చేవాడన్నారు. పవన్ టిడిపి – బిజెపి మధ్య బ్రోకర్ లా మారాడని తీవ్ర విమర్శలు చేశారు.
పవన్ ఒక దళారీలా వ్యవహరిస్తున్నాడన్నారు. ముఖ్యమంత్రి కావాలనే గోల్ లేకపోతే జనసేన పార్టీ ఎందుకు పెట్టాడని ప్రశ్నించారు. అమిత్ షాను కలిసి చంద్రబాబు గురించే మాట్లాడడం పవన్ కి రాష్ట్రంపై ఏ పాటి ప్రేమ ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు పవన్ పనిచేస్తున్నాడని ఆరోపించారు. టిడిపి, బిజెపి మధ్య గ్యాప్ ఉందని పవన్ అంటున్నాడని.. అంటే పవన్ బ్రోకరే కదా..? వాళ్ల మధ్య మధ్యవర్తిత్వం చేసేందుకే ఢిల్లీలో మోదీ, అమిత్ షా ను కలిశారని అన్నారు. పవన్ లాంటి బ్రోకర్ మనకు అవసరమా..? అని ప్రశ్నించారు.