కేసీఆర్ పాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని, బంగారు తెలంగాణ చేస్తానని తన కుటుంబాన్ని బంగారంగా మార్చుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మండలిలో ఉపాధ్యాయులకు ప్రాధాన్యం తగ్గించారని గుర్తుచేశారు. పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా నిజామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేసిందన్నారు.
అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మర్చిపోయిందని, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్న హామీని విస్మరించిందని పేర్కొన్నారు.రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రకటన ఏమైందని ప్రశ్నించారు. ఇక సీఎం రేవంత్ విసిరిన సవాల్‌పైనా ఇదే వేదికగా కిషన్ రెడ్డి స్పందిస్తూ.. పరిపాలనపై చర్చకు సిద్ధమా? అని రేవంత్‌కు ప్రతి సవాల్ చేశారు. చర్చకు తాము సిద్ధమనేనన్నారు.