కాంగ్రెస్ వచ్చాక 1000 రేషన్ కార్డులు తగ్గాయి – KTR

-

కాంగ్రెస్ వచ్చాక కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కాదు దాదాపు 1000 రేషన్ కార్డులు తగ్గాయని ఆరోపణలు చేశారు కేటీఆర్‌. ఈ నివేదిక ఎవరో ఇచ్చింది కాదు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేసిందేనని చూపించారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఘాటు విమర్శలు చేశారు. అడ్డిమారి గుడ్డిదెబ్బన సీఎం అయ్యావు..ఇకనైనా బుద్దితెచ్చుకుని మాట్లాడు..అంటూ శనివారం ఉదయం తెలంగాణ భవన్ వేదికగా విమర్శలు గుప్పించారు.

ఇప్పటికైనా కేసీఆర్‌ను తిట్టుడు, బూతులు మాట్లాడటం, తెలంగాణను శాపం పెట్టుడు బంద్ చేయి యాక్సిడెంటల్ సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. తెలంగాణను ఎవరు తిట్టినా వాళ్లకు ఇలానే సమాధానం చెప్తాను. నువ్వు సిగ్గులేనోడివి కాబట్టి తెలంగాణను ఒక క్యాన్సర్ రోగితో పోల్చావు, ఒక వ్యాధిగ్రస్తమైన రాష్ట్రంగా మాట్లాడావు.రేవంత్ రెడ్డి నువ్వు మూర్ఖుడువి..మీ ఉపముఖ్యమంత్రి ఇచ్చిన నివేదిక చదివి సిగ్గు తెచ్చుకో’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు కేటీఆర్.

 

Read more RELATED
Recommended to you

Latest news