టాబ్లెట్ షీట్స్ వెనుక భాగంలో రంగు గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా?

-

మనకు సాధారణంగా జబ్బు చేసినప్పుడు వివిధ రకాల మాత్రలను వేసుకుంటూ ఉంటారు. అయితే వాటిని ఎప్పుడైనా గమనించారా? ఇవి ఎక్కడినుండి తయారైనవి? ఇది ఎంత పరిమాణంలో మనం వాడుతున్నాము బహుశా గమనించక పోవచ్చు. అలాగే కొన్ని టాబ్లెట్స్ వెనుక భాగంలో, ఎరుపు నీలిరంగు గీతలను కలిగి ఉంటాయి. ఆ గీతలుఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? వాటిని స్టైల్ కోసం వేశారు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. మరి ఆ గీతలు ఎందుకు వేశారో ఇక్కడ తెలుసుకుందాం….

ఎరుపు రంగు గీతలు..

ఎరుపు రంగు గీతలను కేవలం ఆంటీబయాటిక్ టాబ్లెట్స్ మీద మాత్రమే వేస్తారు. ఈ మందులు ఎక్కువగా వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఈ మందులను మందుల షాప్ వాళ్ళు కూడా ఇవ్వరు. అంతేకాకుండా ఈ టాబ్లెట్స్ మీద Rx అని రాసి ఉంటుంది.

నీలి రంగు గీతలు..

నీలి రంగు గీతలు కలిగి ఉన్న టాబ్లెట్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వీటిని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా మందుల షాప్ లో తీసుకోవచ్చు. పారాసెట్మాల్ తదితర మాత్రల పైన ఈ నీలి రంగు గీతలు ఉంటాయి. అంతేకాకుండా మనం వేసే వాడే ప్రతి ఒక్క టాబ్లెట్ మీద ఆ టాబ్లెట్ ఏ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. అవి ఎక్కడ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అవి ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి, ఆ టాబ్లెట్ లకు ఎక్స్పైరీ ఎప్పుడు అన్న విషయాలను కూడా టాబ్లెట్ వెనుక భాగంలో ఈ సమాచారమంతా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version