ఆయన ఏం చెప్పాలి అనుకున్నాడు .. ఏం చెప్పాడు .. ఏం చెయ్యబోతున్నాడు ?

-

ప్రపంచ మానవాళిని వణికిస్తున్న పేరు కరోనా వైరస్. అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా మరియు యూరప్ దేశాలు ఈ వైరస్ ని ఎదుర్కొనలేక చేతులెత్తేస్తున్నారు. ఇటలీ దేశమైతే శవాల దిబ్బగా మారింది. అమెరికాలో రోజురోజుకీ పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇటువంటి టైం లో ఇండియాలో మొదటిలో కరోనా వైరస్ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువగా ఉన్నట్లు వాళ్ల ద్వారా సోకు తున్నట్లు తెలిసిన వెంటనే వాళ్ళని బానే కట్టడి చేశారు. అయితే ఎప్పుడైతే ఢిల్లీ తబ్లిగీ జమాతే గ్రూప్ వారు నిబంధనలకు విరుద్ధంగా ప్రార్థన సమావేశాలు నిర్వహించడం జరిగింది..ఆ సమావేశంలో కొంతమందికి పాల్గొన్న వారికి పాజిటివ్ లక్షణాలు బయట పడటంతో, కరోనా పాజిటివ్ కేసుల విషయంలో ఇండియా ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది.దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు అని కూడా దాదాపు తబ్లిగీ జమాతే కి సంబంధించిన వారివే. ఇటువంటి టైం లో తబ్లిగీ జమాతే చీఫ్ కనిపించకుండా అండర్ గ్రౌండ్ కి వెళ్లి పోవడం తో, ఆయన కోసం ఢిల్లీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే ఆయన గొంతు పేరిట ఇటీవల కొన్ని ఆడియో క్లిప్ లు రిలీజ్ అవ్వడం వాటిలో వివాదాస్పద వ్యాఖ్యలు ఉండటం తో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

తాజాగా ఆయన మానవాళి చేసిన పాపాల వల్లే కరోనా వైరస్ వచ్చిందని.. అల్లా మానవాళిపై ఆగ్రహంగా ఉన్నరన్నట్లుగా కొత్త ఆడియో క్లిప్ లో ఉంది. ఖాంద్లావీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఏం చెప్పాలి అనుకుంటున్నారు…ఏం చెప్పాడో తర్వాత ఏం చేయబోతున్నారు అన్నది ఇప్పుడు ఢిల్లీ పోలీసులకు పాటు కేంద్ర హోంశాఖ కి పెద్ద సవాలుగా మారింది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version