‘ అల వైకుంఠ‌పురంలో ‘ ట‌బు రోల్ లీక్‌… బ‌న్నీకి ఏమ‌వుతుందో తెలుసా

-

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అల వైకుంఠపురంలో సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్, ప్రోమోలు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న సీనియర్ హీరోయిన్ ట‌బు పుట్టినరోజు సందర్భంగా ఆమె స్టిల్‌ రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో ట‌బు రోల్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో అదిరిపోయే అప్డేట్ వైరల్ అవుతుంది. టబు అలవైకుంఠపురంలో చిత్రంలో బన్నీ అక్కగా న‌టిస్తున్నార‌ట‌. ఇక త్రివిక్ర‌మ్‌ గ‌తంలోనే సిస్ట‌ర్ సెంటిమెంట్‌తో ఈ సినిమా తీస్తున్నార‌న్న వార్త వ‌చ్చింది. ఇప్పుడు అదే న్యూస్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ వైర‌ల్ అవుతోంది. మధ్యతరగతి కుటంబం నుండి గొప్పింటి కోడలిగా వెళ్లిన అమ్మాయిగా టబు పాత్ర ఉంటుందని సమాచారం.

ఈ సినిమాలో బ‌న్నీ స‌ర‌స‌న పూజా హెగ్డే మ‌రోసారి హీరోయిన్‌గా న‌టిస్తోంది. వీరిద్ద‌రు గ‌తంలోనే డీజే సినిమాలో న‌టించారు. అక్కినేని హీరో సుశాంత్, నవదీప్, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ వంటి నటులు ఇతర కీలకపాత్రలలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ యూరప్ లో పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version