ప్రపంచంలో అత్యంత అద్భుతమైన నిర్మాణాల్లో ఒకటైన తాజ్ మహల్ గురించి తెలియని వారు ఉండరు. మొగల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ అపురూప కట్టడం ప్రేమకు చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కానీ దాని వెనుక కొన్ని వివాదాలు రహస్యాలు దాగి ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? చాలామంది చరిత్రకారులు పరిశోధకులు తాజ్మహల్ అసలు చరిత్ర గురించి భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇది కేవలం సమాదేనా లేక దాని వెనుక ఇంకా కొన్ని విషయాలు దాగి ఉన్నాయా? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
తాజ్ మహల్ ఒక శివాలయం : కొంతమంది చరిత్రకారులు తాజ్ మహల్ అసలు పేరు తేజో మహాలయ అని వాదిస్తారు. ఇది ఒకప్పుడు శివుడి దేవాలయం అని దీనిని రాజపుత్ర రాజులు నిర్మించారని వారి వాదన షాజహాన్ ఈ ఆలయాన్ని ముస్లిం శైలిలో మార్చి దానిని సమాధిగా మార్చాలని చెబుతుంటారు. ఈ వాదనకు కొన్ని ఆధారాలు కూడా చూపించారు.ముఖ్యంగా తాజ్ మహల్ ఆవరణలో హిందూ దేవాలయాల శైలిలో ఉన్న కొన్ని చిహ్నాలు నిర్మాణాలు కనిపించడం అయితే ఈ వాదనను ప్రధాన చరిత్రకారులు నిర్ధారించలేదు.
నల్ల తాజ్ మహల్ పుకారు : తాజ్ మహల్ కు ఎదురుగా యమునా నది అవతలి ఒడ్డున షాజహాన్ తన కోసం ఒక నల్ల తాజ్మహల్ కట్టించాలని అనుకున్నాడని ఒక పుకారు ఉంది. తెల్ల తాజ్ మహల్ ముంతాజ్ కి నల్ల తాజ్ మహల్ తనకు గుర్తుగా ఉండాలని అతని ఆలోచన. ఈ నిర్మాణం కోసం పునాదులు కూడా వేశారని చెబుతారు కానీ షాజహాన్ ను అతని కుమారుడు ఔరంగజేబు బంధించడం వల్ల ఈ కల నిజం కాలేదని ప్రచారంలో ఉంది.

తాజ్ మహల్ పేరు వెనుక: తాజ్ మహల్ పేరు షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ పేరు నుంచి వచ్చిందని చాలామంది నమ్ముతారు కానీ దీనిని అధికారికంగా ఎక్కడా ధృవీకరించలేదు. ఈ పేరు మొగల్ పాలకుల కాలం నాటి రికార్డులలో లేదు దాని అసల పేరు మూలం గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి.
నిర్మాణంలో శ్రామికుల చేతులు నరికారా?: తాజ్ మహల్ నిర్మాణంలో పనిచేసిన కార్మికుల చేతులను షాజహాన్ నరికించాడు అని ఒక పుకారు ఉంది. మరోసారి అలాంటి కట్టడం ఎవరు నిర్మించకూడదని ఇలా చేశారంటారు కానీ దీనికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. బదులుగా వారికి జీవితాంతం పనిచేయకుండా చూసుకున్నాడని వారి జీతాలు బాగా ఇచ్చాడని మరికొందరు చెబుతుంటారు.
తాజ్ మహల్ కేవలం ప్రేమకు చిహ్నమే కాదు దాని వెనుక ఎన్నో ఆసక్తికరమైన కథలు, రహస్యాలు దాగి ఉన్నాయి. ఇవి చరిత్రను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. చరిత్రకారులు దీని గురించి ఇంకా పరిశోధనలు చేస్తున్నారు.
గమనిక:పైన పేర్కొన్న విషయాలు కొన్ని చారిత్రక వాదనలు, ప్రచారాలపై ఆధారపడి ఉన్నాయి. వీటిలో కొన్నిటికి బలమైన ఆధారాలు లేకపోవచ్చు.