మూసీ పేరుతో రూ.1 లక్ష 50 వేల కోట్ల స్కాం – కేటీఆర్

-

మూసీ సుందరీకరణ మీద విడతల వారీగా దోపిడీ చేస్తున్నారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కేటీఆర్. ఇవాళ మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ…మూసీ సుందరీకరణకు ముందు రూ.1 లక్ష 50 వేల కోట్లు అవుతుందని అన్నారన్నారు.. రూ.16 వేల కోట్లతో అయ్యే ప్రాజెక్టును రూ.1 లక్ష 50 వేల కోట్లతో చెయ్యడమేంటని నిలదీసే సరికి, స్కాంను కూడా ఇన్‌స్టాల్‌మెంట్‌లో చేస్తున్నారని ఆగ్రహించారు.

KTR
KTR

మే 17 2023 నాడు రూ.1100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుండి గోదావరి నీళ్లను గండిపేటకి గ్రావిటీ ద్వారా తీసుకొచ్చే మార్గం ఉన్నపుడు.. రేవంత్ రెడ్డి ఇప్పుడు రూ.7600 కోట్లతో ఎవరి లాభం కోసం ఈ ప్రాజెక్ట్ మొదలుపెడుతున్నాడు? అని నిల‌దీశారు కేటీఆర్.

మీరు ఏమో కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదని చెప్తున్నారు.. మరి మీరు ఇచ్చిన పుస్తకంలోనే 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్లుగా ఉందని అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశాడని నిప్పులు చెరిగారు. కాళేశ్వరం కొట్టుకపోయింది అంటున్నారు కానీ 12 లక్షల కూసెక్కుల వరద వచ్చినా బ్యారేజీ బాగానే ఉంది కదా అని అక్బరుద్దీన్ ఒవైసీ గారు అడిగారని చుర‌క‌లు అంటించారు. 20 నెలలుగా దాన్ని ఎందుకు రిపేర్ చేయడం లేదని కూడా వారు అడిగారు ఎద్దేవా చేశారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news