చాలా మంది మగవాళ్ళు తమకు నచ్చినట్లుగా గడ్డాన్ని స్టైలింగ్ చేయించుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే కొన్ని స్టైల్స్ చేయించుకోవాలంటే ఒత్తుగా గడ్డం ఉండాలి. అయితే కొందరి మగవాళ్ళకి మాత్రం గడ్డం ఒత్తుగా ఎదగదు. అలాంటి వారిలో గడ్డం ఒత్తుగా ఎదగాలి అంటే ఈ ఆహార పదార్థాలను డైట్లో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గడ్డం ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం.
దాల్చిని:
దాల్చిని మంచి రుచితో వాసనతో ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. దాల్చిని పేస్ట్ కింద చేసి అందులో నిమ్మరసం వేసి గడ్డం మీద అప్లై చేస్తే గడ్డం ఒత్తుగా ఎదగడానికి అవుతుంది. అలానే మీరు తేనే మరియు దాల్చిన వేడినీళ్లతో తీసుకుంటే కూడా గడ్డం పెరగడానికి సహాయపడుతుంది.
పాలకూర:
పాలకూర లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్ మొదలైనవి ఇందులో ఉంటాయి. పాలకూరని డైట్ లో తీసుకోవడం వల్ల గడ్డం ఒత్తుగా ఎదగడానికి అవుతుంది. మీరు పాలకూర జ్యూస్ కూడా తాగొచ్చు.
గుమ్మడి గింజలు:
గుమ్మడి గింజలు కూడా గడ్డం ఒత్తుగా పెంచుతాయి. మీరు దీనికోసం మీ ఎండలో గుమ్మడి గింజలు ఈ వదిలేసి ఆ తర్వాత సాల్ట్ తో పాటు మిక్స్ చేసుకు తీసుకోవచ్చు. ఇది కూడా గడ్డాన్ని పెంచడానికి సహాయం చేస్తుంది.
ఉల్లి జ్యూస్:
ఉల్లి జ్యూస్ కూడా గడ్డం ఒత్తుగా మారుతుంది. దీనికోసం ముందుగా మీరు ఉల్లిరసం ని తీసుకొని అందులో రెండు నుండి మూడు చుక్కల ఆముదాన్ని వేసి గడ్డంపై అప్లై చేసి కాసేపు వదిలేసి కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒత్తుగా గడ్డం ఎదుగుతుంది.