ఈ ఆహార పదార్థాలను మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. అదే విధంగా రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందించుకోవడానికి వీలవుతుంది. విటమిన్ సి ఉండే ఆహార పదార్థాలు డైట్ లో తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని సులువుగా పెంచుకోవచ్చు.
ఆహారంలో వెల్లులి:
పురాతన కాలం నుండి వెల్లుల్లి వాడుతూనే ఉన్నాం. దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి కూడా వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది.
బచ్చలికూర:
బచ్చలి కూర ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి క్యాన్సర్ రిస్కు కూడా ఇది తగ్గిస్తుంది. బచ్చలి కూర లో విటమిన్ కె సమృద్ధిగా ఉంటుంది. దీని కారణంగా కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
నిమ్మ:
నిమ్మలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అదే విధంగా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
క్యాప్సికమ్:
క్యాప్సికమ్ లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది అదే విధంగా ఇందులో బీటా-కెరోటిన్ కూడా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
బ్రోకలీ:
బ్రోకలీ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది క్రానిక్ సమస్యలు రాకుండా బ్రోకలీ బాగా సహాయపడుతుంది. కాబట్టి వీటిని తప్పకుండా మీ డైట్ లో తీసుకోండి. దీనితో మీరు మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు.