పురుషుల్లో సెక్సువల్ హెల్త్ బాగుండాలంటే ఇవి బాగా ఉపయోగపడతాయి..!

-

మామూలు ఆరోగ్యం లాగే సెక్స్ హెల్త్ కూడా తీసుకునే ఆహారం, లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది. మంచి జీవన విధానం ఉంటే సెక్స్ సమస్యలు మగవారిలో రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

నిద్ర మరియు వ్యాయామం:

ఎక్కువ సేపు నిద్ర పోవడం వల్ల సెక్సువల్ హెల్త్ కూడా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. 7 గంటల వరకు నిద్ర పోవచ్చు అని నిపుణులు చెప్పడం జరిగింది. డాటా ప్రకారం మంచి నిద్ర ఉన్నవారిలో 31.7 శాతం మంది క్రమం తప్పకుండా ఏడు గంటలకు మించి high erection confidence కలిగి ఉన్నారని, రాత్రి ఐదు గంటల కన్నా తక్కువ నిద్రపోయే 18 శాతం మందికి మాత్రమే వారి high erection confidence ఉందని డేటా  వెల్లడించింది.

అదే విధంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేసే పురుషుల లో 19.5 శాతం మంది ideal ejacualtion పొందుతారని తేలింది.

ఏది ఏమైనా మంచిగా నిద్ర పోవడం వ్యాయామం చేయడం మంచిది. అదే విధంగా త్వరగా డిన్నర్ తినడం, టీ కాఫీలకు దూరంగా ఉండడం లాంటివి చేయాలి.

ఆయుర్వేదం సెక్సువల్ హెల్త్ కి మంచిది:

ఆయుర్వేదం లో సెక్సువల్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి ఎన్నో రకాల మెడిసిన్స్ ఉన్నాయి ముఖ్యంగా అశ్వగంధ గురించి చెప్పుకొని తీరాలి. ఒత్తిడిని తగ్గించడానికి, మంచి నాణ్యమైన నిద్ర పొందడానికి బాగా సహాయ పడుతుంది. సెక్సువల్ హెల్త్ కి కూడా బాగా ఉపయోగ పడుతుంది.

అదే విధంగా శిలాజిత్ కూడా బాగా పని చేస్తుంది. దీని వల్ల కూడా టెస్టోస్టిరాన్ ఇంప్రూవ్ అవుతుంది. ఏది ఏమైనా సరైన జీవన విధానం పాటించడం మంచిది. మంచిగా నిద్ర పోవడం మంచి ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయడం వంటివి మంచివి.

సెక్సువల్ డ్రైవ్ పెంచుకోవడానికి యోగా:

యోగాని ప్రతి రోజూ చేయడం వల్ల సెక్సువల్ డ్రైవ్ పెరుగుతుంది. ధనురాసనం వంటి ఆసనాల వల్ల సెక్సువల్ డ్రైవ్ పెంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version