తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో 42శాతం వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తోంది. గత నెలలో ప్రభుత్వ పనితీరుతో పాటు రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఏ మేరకు వ్యతిరేకత ఉందనే విషయాలపై, సంక్షేమ పథకాలపై ప్రజల ఉన్న సానుకూలతపై ప్రభుత్వం నిఘావర్గాల ద్వారా సర్వే నిర్వహించినట్టు తెలుస్తోంది. నాలుగు నెలల క్రితం కూడా ఇలాగే సర్వే నిర్వహించగా.. అప్పుడు ప్రజల్లో సానుకూలత ఉందని కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు.
అయితే గతనెలలో నిర్వహించన సర్వే ఫలితాలు మాత్రం ఈ నెల మొదటి వారంలోనే కేసీఆర్ చేతికి వచ్చినట్టుతెలుస్తోంది. ఇక ఈ సర్వేలో సంచలన విషయాలు వెల్లడయినట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఎంతో ఖర్చుపెట్టి మరీ నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలపై 60శాతం మంది ప్రజలు సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక ఎమ్మెల్యేలు, మంత్రుల గ్రాఫ్ పడిపోయినట్టు తెలుస్తోంది. వారి పనితీరులోనూ ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అయిందని సర్వే తెలిపింది. రాష్ట్రంలో దాదాపు 101నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని నిఘావర్గాలు కేసీఆర్ కు వివరించాయి. ఈ కరోనా సమయంలో ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండకపోవడం, సరిగ్గా పనిచేయకపోవడం, బయట పెద్దగా తిరగకపోవడం లాంటివి ప్రభావం చూపాయి. అలాగే మంత్రుల గ్రాఫ్ కూడా తగ్గిపోయి, వ్యతిరేకత పెరుగుతోందని తెలియడంతో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. వారికి పనితీరు మార్చుకోవాలని ఆదేశించారంట.