ఉదయాన్నే ఎక్కువగా ఆకలి వేస్తోందా..? అయితే వీటిని తీసుకోండి..!

-

మనం రాత్రి ఎప్పుడో భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఆహారము తీసుకోవడానికి చాలా సేపు పడుతుంది. చాలా మందికి ఉదయాన్నే ఎక్కువ ఆకలి కూడా వేస్తుంది. అయితే అలా ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. కడుపు నిండుతుంది అనేది ఇప్పుడు చూద్దాం.

 

ఉదయాన్నే బాగా ఆకలి వేసినప్పుడు వెంటనే ఎనర్జీ రావాలంటే ఈ ఆహార పదార్థాలు బాగా హెల్ప్ అవుతాయి. అలాంటప్పుడు మీరు ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే బ్రేక్ ఫాస్ట్ తయారు అయ్యే వరకు కూడా మీరు ఆకలితో ఉండగలుగుతారు.

ఖర్జూరం:

ముఖ్యంగా చలికాలం ఖర్జూరం తీసుకోవడం వల్ల ఒంటిని వేడిగా మారుస్తుంది. వెంటనే ఎనర్జీ రావడానికి ఖర్జూరం సహాయ పడుతుంది. ఐరన్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది.

నట్స్:

రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే నట్స్ ని తీసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది. అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రోజూ ఒక గుప్పెడు నానబెట్టిన నట్స్ ని మీరు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

పండ్లు:

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. బొప్పాయి, ఆపిల్ మొదలైన పండ్లు తీసుకోవడం వల్ల ఆకలి ఎక్కువ సేపు వేయకుండా ఉంటుంది. అలానే కడుపుని పళ్ళు శుభ్రపరుస్తాయి. కనుక ఉదయాన్నే మీరు పండ్లు కూడా తీసుకోవచ్చు.

పాలు:

పాలు అన్నిటికంటే అవసరం. ముఖ్యంగా చలికాలంలో వేడిగా ఒక గ్లాసు పాలు తీసుకుంటే గొంతు సమస్యల నుండి కూడా రిలీఫ్ ని పొందొచ్చు. ప్రోటీన్ పాలల్లో వున్నా మరింత ప్రోటీన్ పౌడర్ ని మరియు డ్రై ఫ్రూట్స్ పౌడర్ ను వేసి తీసుకుంటే కూడా మంచిదే. ఇలా ఉదయాన్నే ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే మీకు వెంటనే ఎనర్జీ వస్తుంది అలానే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version