గవర్నర్ వ్యవస్థపై తలసాని సంచలన వ్యాఖ్యలు.. ఆమె అవసరమే లేదు…!

-

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై పై మంత్రి తలసాని శ్రీనివాస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కి కూడా పరిమితులు ఉంటాయి… పీఎం, హోం మంత్రి ని కలిసిన తర్వాత మీడియా తో మాట్లాడాల్సిన అవసరం ఏమి వచ్చిందని మండిపడ్డారు. మేము వరి దాన్యం మీద పోరాటం చేస్తున్నామని.. గవర్నర్ బాధ్యతతో మాట్లాడాలి, రాజకీయాలు అవసరం లేదని చురకలు అంటించారు.

గవర్నర్ వ్యవస్థ అస్సలు అవసరమే లేదని… నాడు ఎన్టీఆర్ ను గద్దె దించేందుకు గవర్నర్ ను వాడుకున్నారని ఫైర్‌ అయ్యారు. రాజకీయాలు గవర్నర్ గారు మాట్లాడడం కరెక్ట్ కాదని.. ఉపరాష్ట్రపతి మీడియాతో మాట్లాడలేనని చాలా సార్లు తెలిపారు…అది ఆయన హుందా తనమన్నారు.

డ్రగ్స్ వెనుక ఎవరు ఉన్న వదలా వద్దని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే తెలిపారని… బాధ్యత రహితంగా రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నావని పేర్కొన్నారు. డ్రగ్స్ ని పట్టుకుంది మేమే కదా.. హైదరాబాద్ లో డ్రగ్స్ ఉన్నట్లు ,మనుషులు లేనట్లు మాట్లాడుతున్నారు..డ్రగ్స్ ముద్ర వేస్తున్నారన్నారు. నూకలు తినిపించమని మాట్లాడుతున్నారు .. బీజేపీ వాళ్ళు తినండని చురకలు అంటించారు. వెంకయ్యనాయుడు రాజకీయ పరమైన అంశాలు మాట్లాడారు..మా పరిధి వరకు మేము మాట్లాడుతామని చాలా సార్లు చెప్పారని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version