ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎండా కాలం లో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బ తింటుంది. ప్రతీ ఒక్కరు కూడా చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. ఎండలు మండి పోవడం వల్ల పిల్లలకి వడదెబ్బ తగిలే అవకాశం కూడా ఉంటుంది.
హీట్ స్ట్రోక్ వలన బాడీ టెంపరేచర్ పెరిగిపోతుంది. పైగా బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా కుదరదు. అయితే చాలా మంది పిల్లలు ఎండలో బయటకు వెళ్లి ఆడుకుంటూ వుంటారు. దీని వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. అయితే హీట్ స్ట్రోక్ లక్షణాలు గురించి ఇప్పుడు చూద్దాం. అలానే ఎలాంటి టిప్స్ ని ఫాలో అవ్వాలి అనేది కూడా చూసేద్దాం.
వడదెబ్బ లక్షణాలు:
చెమట పట్టడం తగ్గిపోతుంది
ఒళ్ళు బాగా వేడిగా అయిపోతుంది
కళ్ళు తిరుగుతాయి
అలసటగా అనిపిస్తుంది
నీరసంగా ఉంటుంది
ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వేసవికాలంలో స్పెషల్ కేర్ తీసుకోవాలి. పిల్లలు అంత వేడిని తట్టుకో లేరు. పెద్దవాళ్లు అయితే వేడిని తట్టుకోగలరు. కానీ వీళ్ళు ఏ మాత్రం తట్టుకోలేరు. అందుకే ఎండాకాలంలో మీ పిల్లలకి చాలా కష్టమవుతుంది.
ఎండలో పిల్లల్ని బయటకు పంపించకండి. అలానే సూర్యాస్తమయం అయ్యే వరకు కూడా ఇంటిపట్టునే ఉంచండి.
ఎక్కువగా నీళ్లు తాగేలా చూసుకోండి.
ఎండలో బయటకి వెళ్ళినపుడు టోపీని వేయండి లేదంటే గొడుగు తీసుకు వెళ్ళండి.
వాళ్లకి కాటన్ దుస్తులు మాత్రమే వెయ్యండి.
అలానే సన్ స్క్రీన్ లోషన్ ను అప్లై చేయడం కూడా మంచిదే.
కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, నీళ్లు, ఓఆర్ఎస్, తాజా జ్యూస్ వంటివి వాళ్ళకి ఇవ్వండి.