కొడుకుకు ప్రేమ‌తో తెలంగాణ మంత్రి

-

కుమారుడు త‌ల‌సాని  సాయి కిరణ్ రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై ఆందోళ‌న చెందుతున్నారు ఆయ‌న తండ్రి, రాష్ర్ట‌మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌. కొడుకుని ఎలాగైనా కీల‌క ప‌ద‌విలో చూడాల‌ని తెగ ఆరాట ప డుతున్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో మ‌రో మారు సాయికిర‌ణ్ అదృష్టాన్ని ప‌రీ క్షించేందుకు రెడీ అవుతున్నారు. ఈనేప‌థ్యంలోనే టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కూడా త‌ల‌సాని సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు.

రాష్ట్ర విభజనకు ముందు టీడీపీలో ఉన్న తలసాని శ్రీనివాస్ యాద‌వ్ .. 2014 ఎన్నికల్లోనూ ఆ పార్టీ తరపునే పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత టీఆర్ఎస్ లోకి జంప్ అయిన పార్టీ అధినేత కేసీఆర్‌కు అత్యంత సాన్నిహిత్యంగా ఉంటూ వస్తున్నారు. దీంతో ఆయనకు అప్పట్లో మంత్రి పదవిని ఇచ్చారు కేసీ ఆర్. ఇక 2018లోనూ మరోసారి సీఎం కుర్చీని కేసీఆర్‌ సొంతం చేసుకోగా.. మరోసారి ఆయన కేబినెట్‌లో తలసాని స్థానం దక్కించుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. త‌న వారసుడు సాయి కిరణ్ రాజకీయ భ వితవ్యం ఏమిటనే ప్ర‌శ్న‌ త‌ల‌సానిని వెంటాడుతోంది.
ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారుడిని ప్రత్యక్ష ఎన్నికల్లోకి తీసుకొచ్చారు తలసాని. అంతకుముందు తలసాని శ్రీనివాస్ సేవా సమితి పేరిట కొన్ని కార్యక్రమాలు నిర్వహించే సాయి కిరణ్.. సికింద్రాబాద్ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున ఎంపీగా పోటీ చేశారు. అయితే అధిష్టానాన్ని ఒప్పించి, ఎంపీ  సీటును సాయికి ఇప్పించుకునేందుకు ఆయ‌న తండ్రి తలసాని అష్ట‌క‌ష్టాలు ప‌డ్డారు. అయితే అనూహ్యంగా ఈ ఎన్నిక‌ల్లో సాయికిర‌ణ్ ఓట‌మిపాలు అయ్యారు.

ఇక అప్ప‌టి నుంచి సాయికి మరో అవకాశం ఇవ్వాల‌ని టీఆర్ఎస్‌తో సంప్రదింపులు జరుపుతున్నారట తలసాని. ఈనేప‌థ్యంలోనే రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నిక‌ల్లో ఈ సారి టీఆర్ఎస్ తరఫున తన కుమారుడికి టికెట్ లభించేలా తలసాని ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశార‌ని పార్టీలో ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌తో కూడా ఆయ‌న సంప్రదింపులు జరుపుతున్నారట. అ యితే ఈ విషయంపై కేటీఆర్ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సారి జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తలసాని కీలకం కానున్నట్లు పార్టీలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version