మేం అస్సాం వెళ్లి…రెచ్చ గొడతామని తెలంగాణ మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసోం సీఎం బిశ్వశర్మ ప్రసంగాన్ని అడ్డుకున్నాడు టీఆర్ఎస్ నేత. సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తు న్నారని అసోం సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ నేత.. మైక్ లాగేం దుకు ప్రయత్నం చేశాడు.
దీంతో అతన్ని పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈ సంఘటనపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ స్పందించారు. హైదరాబాద్ ప్రజలను రెచ్చగొట్టేందుకే అసోం సీఎంను తెచ్చారు.. మేం కూడా అసోం వెళ్లి మాట్లాడగలమని హెచ్చరించారు.
హైదరాబాద్ ప్రశాంతంగా ఉండటం బీజేపీకి ఇష్టం లేదా? అని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ… అసోం సీఎం చేసింది తప్పు.. బాధ్యతాయుత పదవిలో ఉండి ఏం మాట్లాడుతున్నారు?.. రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదు.. నిమజ్జన ఏర్పాట్లపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు.
#WATCH | Telangana: A man tried to confront Assam CM Himanta Biswa Sarma by dismantling the mike on a stage at a rally in Hyderabad pic.twitter.com/HFX0RqVEd8
— ANI (@ANI) September 9, 2022