ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటానన్న తమన్నా…!

-

టాలీవుడ్ లో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బాహుబలి సినిమాతో ప్రభాస్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా భారీ వసూళ్లు సాధించాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉన్నాడు ప్రభాస్. అతని పెళ్లి గురించి టాలీవుడ్ జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ చిన్న వార్త వచ్చినా సరే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాని ప్రభాస్ కి సంబంధించిన పెళ్లి వార్త మాత్రం ఇప్పట్లో వచ్చే విధంగా కనపడటం లేదు. అయితే అతన్ని పెళ్లి చేసుకుంటా అని చెపింది తమన్నా. తనకు అలాంటి మొగుడు కావాలని చెప్పేసింది ఈ సీనియర్ హీరోయిన్. పెళ్లి చేసుకుంటే ఎలాంటి వారిని చేసుకుంటారనే ప్రశ్నకు, ఒక వేళ తన పెళ్లికి స్వయంవరం ఏర్పాటు చేస్తే.. ప్రభాస్‌తో పాటు ఆ ఇద్దరు హీరోలను స్వయంవరానికి పిలుస్తానని చెప్పింది.

ప్రస్తుతం ఈ భామ మూడు పదుల వయసు దాటేసింది. ఈ అమ్మాయి పెళ్లి కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు ఆమె అభిమానులు. ఇప్పటికే హృతిక్ రోషన్ కి పెళ్లి అయింది. ప్రభాస్ కి అవ్వలేదు, విక్కి కౌశల్ కి కూడా అవ్వలేదు. కాగా వీరు ఇద్దరూ కలిసి బాహుబలి సినిమాలో నటించారు. తొలి భాగంలో వీరి మధ్య వచ్చిన పచ్చ బొట్టేసినా అనే పాట సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version