అజా ఫ్యాషన్స్ షోరూమ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా తమన్నా

-

అజా ఫ్యాషన్స్ షోరూమ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా హాజరయ్యారు. భారత్ లో అగ్రగామి ఫ్యాషన్ లగ్జరీ రిటైలర్ గా పేరుపొందిన అజా ఫ్యాషన్స్ ఇప్పుడు హైదరాబాదులోనూ కాలు మోపింది. అజా హైదరాబాద్‌ స్టోర్‌ని ప్రముఖ పారిశ్రామికవేత్త పింకీ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అజా వ్యవస్థాపకుడు, ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ అల్కా నిషార్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ దేవాంగి పరేఖ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ వేడుకలో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ డిజైనర్లు నుపూర్‌ కనోయ్‌, మయూర్‌ గిరోత్రా, రితికా మీర్ చందానీ, షాహిల్‌ అనేజా, ధ్రువ్‌ వెయిష్‌, శ్రియా సోమ్‌ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ… తనను ఆహ్వానించినందుకు డాక్టర్ అల్కా నిషార్, దేవాంగి పరేఖ్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. అధునాతనమైన ఈ స్టోర్ హైదరాబాద్‌లోని లగ్జరీ షాపర్‌లకు గొప్ప షాపింగ్‌ అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version