ప్రముఖ నటుడికి హార్ట్ ఎటాక్.. ఆరోగ్య పరిస్థితి విషమం !

-

ప్రముఖ తమిళనటుడు వివేక్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన కుప్పకూలిపోయారు. దీంతో వివేక్‌ను చెన్నైలోని వడపళని సిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కార్డియాక్ అరెస్ట్‌‌ అయినట్టు గుర్తించారు వైద్యులు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

59 ఏళ్ల వివేక్ నిన్న కోవిడ్ 19 వ్యాక్సిన్ డోస్ తీసుకున్నారు. అందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా బారి నుంచి సురక్షితంగా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటి చిట్కాలు ఎన్ని పాటించినా.. టీకా మాత్రమే కరోనా నుంచి కాపాడుతుందని చెప్పారు వివేక్‌. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే వివేక్.. తాను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోడాన్ని కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇంతలోనే ఆయనకు హార్ట్ ఎటాక్ రావడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version