‘ధనుష్ ‘సార్’ క్లాసు మొదలెట్టేశాడు’.. టీజర్ అదిరిందిగా..

-

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు ధనుష్‌ ‘సార్’ క్లాసులు మొదలెట్టేశాడు. ఆయన లెక్చరర్ గా నటించిన ‘సార్’ సినిమా టీజర్ రిలీజ్ అయింది. నేడు ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం ‘సార్’ టీజర్ ను విడుదల చేసింది. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త మేనన్ కథానాయిక. టీజర్ లో ధనుష్ చాలా స్మార్ట్ గా కనిపించాడు. క్లాస్ డైలాగ్స్ టీజర్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

విద్యా వ్యవస్థ నేపథ్యంలో యాక్షన్‌- డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. వ్యాపారంగా మార్చేసిన కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తులతో హీరో చేసే పోరాటమే ఈ సినిమా. కథ ప్రకారం.. ధనుష్ ‘బాల గంగాధర్ తిలక్’ అనే జూనియర్ లెక్చరర్ పాత్రలో కనిపించారు. ఈ ఏడాది అక్టోబర్ చివర్లో సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కోలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలకు పని చేసిన దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. తెలుగులో ధనుష్ నటిస్తోన్న తొలి తెలుగు సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ధనుష్ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు స్ట్రెయిట్ గా తెలుగులో ఎంట్రీ ఇస్తుండడంతో.. మంచి బజ్ క్రియేట్ అయింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version