తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ విద్యా విధానానికి స్వస్తి చెప్పారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఈ మేరకు స్టేట్ పాలసీని ప్రకటించారు సీఎం స్టాలిన్. ద్విభాషా విధానానికి మొగ్గు చూపిన తమిళనాడు ప్రభుత్వం.. సైన్స్, ఇంగ్లీష్, ఏఐలకు పెద్దపీట వేశారు. 11, 12 తరగతుల మార్కుల ఆధారంగా యూజీ అడ్మిషన్లు ఉంటాయని స్పష్టం చేశారు.

ఇది ఇలా ఉండగా, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని కొనసాగించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది మోడీ ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అదే సమయంలో త్రిపుర అలాగే అస్సాం రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించింది మోడీ ప్రభుత్వం.