కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని కొనసాగించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది మోడీ ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అదే సమయంలో త్రిపుర అలాగే అస్సాం రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించింది మోడీ ప్రభుత్వం.

మొత్తం 7250 కోట్ల చొప్పున ఈ రెండు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ అందించబోతోంది. అలాగే 4250 కోట్లు గ్రాండ్ గా ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం. సాంకేతిక విద్య కోసం 4200 కోట్లు ప్రకటన చేసింది. పాలిటెక్నిక్ అలాగే ఇంజనీరింగ్ కాలేజీల అప్ గ్రేడ్ కోసం కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.