పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. రాష్ట్రపతి పాలనకు లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి సమయంలో పుదుచ్చేరి అసెంబ్లీ ని రాష్ట్రపతి రద్దు చేసినట్లు చెబుతున్నారు.
ఇక నిన్న నారాయణస్వామి బలపరీక్షలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నేరుగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసి తన రాజీనామా లేఖ సమర్పించారు. ఈ నేపధ్యంలో ఆమె రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయగా దానిని రాష్ట్రపతి ఆమోదించారు. ఇక త్వరలోనే అక్కడ అసెంబ్లీకి ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సారి అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందనేది.