తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి తమిళనాడు రాష్ట్రాన్ని వరణుడు వదలడం లేదు. చెన్నైతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం, ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. గురువారం ఐఎండీ చెప్పిన వివరాల ప్రకారం చెన్నైతో పాటు 12 జిల్లాల్లో పుదుకోట్టై, రామనాథపురం, తూత్తుకుడి, శివగంగ, మధురై, తేని, దిండుగల్, తిరుచిరాపల్లి, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, తమిళనాడులోని మైలదుతురై జిల్లాలు, కారైకల్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తూత్తుకూడి, తెన్ కాశీ, తిరునల్వేలీ, చెంగల్పట్టు జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈనాలుగు జిల్లాల్లో పాఠశాలకలకు సెలవులు కూడా ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా తూత్తుకూడి ఎయిర్ పోర్ట్ కు విమానాల రాకపోకలను నిలిపివేశారు. విమానాలను వేరే ప్రాంతాలకు పంపిస్తున్నారు. చెన్నై నగరం సమీపంలోని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.