గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న సాయంత్రం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులని ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డులు, 17 మందికి పద్మ భూషణ్ అవార్డులు, 110 మందికి పద్మశ్రీ అవార్డులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా వీరందరికి దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఒకప్పటి రాజకీయ నేత,తమిళ్ స్టార్ హీరో, దివంగత కెప్టెన్ విజయ్ కాంత్ కి పద్మ భూషణ్ అవార్డుని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. విజయ్ కాంత్ తమిళంలో ఎన్నో చిత్రాలలో నటించారు .అంతేకాకుండా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి చాలామంది ప్రజలకు సేవలు అందించాడు.గత ఏడాది డిసెంబర్ 28న ఆరోగ్య సమస్యలతో విజయ్ కాంత్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లారు. ఇప్పుడు మరణానంతరం ఆయనకు పద్మభూషణ్ ప్రకటించడంపై కుటుంబ సభ్యులు, తమిళ ప్రముఖులు, ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విజయకాంత్ భార్య స్పందిస్తూ ఈ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది అంతేకాకుండా ఆయనను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈ అవార్డు అంకితం అని పేర్కొంది.