త‌మ్మినేని ఆ సెంటిమెంటుకు భ‌య‌ప‌డ్డారా… అందుకే వార‌సుడు ఎంట్రీ…!

-

ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రం నుంచి విభ‌జ‌న రాష్ట్రాల వ‌ర‌కు ఏపీ, తెలంగాణ రాజ‌కీయాల్లో ఓ కీల‌క‌మైన సెంటిమెం ట్ ఉంది. అదేంటంటే.. స్పీక‌ర్‌గా ప‌నిచేసిన నాయ‌కులు త‌ర్వాత ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రాలు ఎక్కింది లేదు. ఇది ఉమ్మ‌డి రాష్ట్రం నుంచి ఆన‌వాయితీగా ను సెంటిమెంటుగాను కూడా వ‌స్తుండడం గ‌మ‌నార్హం. స్పీక‌ర్‌గా చేసిన మ‌హిళ‌లు కూడా  ఓడిపోయారు. ఏపీ విష‌యాన్ని తీసుకుంటే.. 2014లో కోడెల శివ‌ప్ర‌సాద్ స్పీక‌ర్ చేశారు. త‌ర్వాత గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. ఇక‌, తెలంగాణ‌లోనూ స్పీక‌ర్ గా చేసిన మ‌ధుసూద‌న చారి కూడా 2018 ఎన్నిక‌ల్లో ఓడిపోయారు.

ఇదే సెంటిమెంటును ఇప్పుడు ఏపీ స్పీక‌ర్ త‌న‌కు కూడా వ‌ర్తిస్తుందా? అనే భ‌యంతో ఉన్నార‌ని వినిపిస్తోం ది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గం నుంచి సుదీర్ఘ కాలం వెయిటింగ్ త‌ర్వాత గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలిచారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ఆయ‌న‌కు రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. అయితే.. ఆయ‌న‌లో ఈ సెంటిమెంటు ఎప్ప‌టిక‌ప్పుడు భ‌య‌పుట్టిస్తూనే ఉంది. దీంతో ఎప్పుడెప్పుడు దానిని వ‌దిలించుకుందామా? అని ఎదురు  చూస్తున్నారు. ఈక్ర‌మంలోనే మంత్రి ప‌ద‌వికోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

మ‌రో ప‌ది మాసాల్లో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉంది. దీంతో త‌న‌ను మంత్రిగా తీసుకోవాల‌ని ఆయ‌న ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. ఇప్పుడున్న జిల్లా స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. పైగా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న స్పీక‌ర్‌ను వ‌దులుకునేందుకు జ‌గ‌న్‌కు కూడా ఇష్టం లేదు. దీంతో ఐదేళ్లు త‌మ్మినేని సీతారం నే కొన‌సాగించే యోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో సెంటిమెంటును తట్టుకునేందుకు సీతారాం త‌న కుమారుడు నాగ్‌ను రంగంలోకి దింపాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆముదాల వ‌ల‌స‌లో ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా.. నాగ్ ప్ర‌త్య‌క్ష మ‌వుతున్నాడు. అధికారుల‌తో ట‌చ్‌లో ఉన్నాడు. దీనిని బ‌ట్టి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి ఈయ‌నే అనే ప్ర‌చారం సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చివ‌రికి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version