బ్రేకింగ్ : ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రత్యర్థుల చేతిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరబద్రం సోదరుడు తమ్మినేని కృష్ణయ్య హత్యకు గురయ్యాడు. ఇటీవలనే సీపీఎం నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన కృష్ణయ్యను.. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
ఖమ్మం జిల్లా తెల్దారుపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్య…తెరాస నేత తుమ్మల నాగేశ్వరరావుకు ప్రధాన అనుచరుడని సమాచారం అందుతోంది. బైకుపై ఇంటికి వెళ్తుండగా ఆరుగురు వ్యక్తులు ఆటోతో ఆయన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి…. అనంతరం వేట కొడవళ్లతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని తెలుస్తోంది.ఈ హత్యకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది.